- Advertisement -

తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

- Advertisement -

బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీం కోర్టు. తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుగగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది.

బీసీ రిజర్వేషన్ల జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే ను సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా ? అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది సుప్రీం.

తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది…తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు..తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు…అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయి…శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించాం…డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాము…గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది…ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారు…బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు…రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాన్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది…సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది అన్నారు.

డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించింది…కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించాం..బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచాము…ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాము…సమగ్రంగా , సాంకేతికంగా సర్వే జరిపాము…అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాము..94,000 మంది డేటా సేకరించారు…ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ సర్వే నిర్వహించాము…దీనిపైన స్టే ఎలా విధిస్తారు ?,హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు…వెంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు.

మాధవరెడ్డి తరఫున లాయర్..రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది… షెడ్యూల్డ్ ఏరియా ,గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉంది…జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదు…తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు….కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించింది అని తెలిపారు.

మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించింది..50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది…
ట్రిపుల్ టెస్ట్ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదు అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -