- Advertisement -

గుండె సమస్య..బాబు హెల్త్ పై కోర్టుకు నివేదిక!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 28తో బాబు బెయిల్ గడువు ముగియనుండగా కంటికి చికిత్స తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారు చంద్రబాబు. ఇక చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో బెయిల్ లబించగా ఆయన హెల్త్ అప్‌డేట్‌ని హైకోర్టుకు సమర్పించారు బాబు తరపు న్యాయవాదులు.

చంద్రబాబుకు ఐదు వారాల ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చారని..ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలని తెలిపారు. ఇక చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఆయన గుండె పరిమాణం పెరిగిందని..ఆయనకు తగిన విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించిన నివేదికను కోర్టుకు సమర్పించారు.

చంద్రబాబు మరికొన్నిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని …అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మెడిసిన్స్ వాడాల్సి ఉందని వైద్యులు మోమోలో కోర్టుకు తెలియజేశారు.సమయం అయిపోవడంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఇక అనారోగ్య సమస్యలతో బెయిల్ పై ఉన్న చంద్రబాబు మరిన్ని రోజుల విశ్రాంతి అవసరం నేపథ్యంలో బెయిల్ పొడగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -