టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. చంద్రబాబు రిమాండ్‌ను ఎల్లుండి వరకు పొడగించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్‌కే మొగ్గుచూపారు. ఇక వర్చువల్‌గా చంద్రబాబుతో మాట్లాడారు జడ్జీ. జైల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని బాబును అడిగి తెలుసుకున్నారు.జైల్లో అధికారులు కల్పిస్తున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇక తనని అకారణంగా అరెస్ట్ చేవారని…నా బాధ,ఆవేదన అంతా దానిగురించే అన్నారు చంద్రబాబు. తన గురించి రాష్ట్రం,దేశంలో అందరికి తెలుసని చెప్పారు . ఇక చంద్రబాబు చెప్పిన విషయాలు అన్ని నోట్ చేసుకున్నారు జడ్జీ.
మీ పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి…రిమాండ్‌ని శిక్షగా భావించొద్దు అన్నారు. చట్టం ప్రకారం అంతా సమానమేనని తెలిపారు. మిమ్మల్ని కస్డడీకి ఇవ్వాలని సీబీఐ అడుగుతోంది…మీ లాయర్లు అవసరం లేదని వాదించారని చెప్పారు జడ్జి. కోర్టులో కస్టడీ పిటిషన్ సందర్భంగా ఇరువర్గాల లాయర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.పోలీస్ కస్టడీకి ఇస్తే తప్పేంటి అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇక కస్టడీ పిటిషన్‌పై తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.
