టీడీపీ – జనసేన పొత్తులో లాభపడేదెవరూ?…చంద్రబాబు మైండ్ సెట్ తెలిసిన వారికి ఈపాటికే అర్ధమై పోయి ఉంటుంది. ఎందుకంటే ఈ పొత్తులో ఖచ్చితంగా లాభపడేది టీడీపీనే. ఎందుకంటే చంద్రబాబు గత చరిత్ర తెలిసిన వారికి కన్ఫామ్ అయిపోయి ఉంటుంది కూడా. తాజాగా టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ వెనుక ఉన్న చంద్రబాబు మాస్టర్ ప్లాన్ పవన్‌ను వాడుకుని జనసేన ప్రభావం లేకుండా చేయడమేనని రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్నవారికి అర్ధమవుతోంది.
ఓ వైపు ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరు పార్టీల నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కానీ అసలు విషయం సీట్ల సంఖ్య, స్థానాలపై మాత్రం చంద్రబాబు నుండి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మరోవైపు జనసేనాని పవన్ మాత్రం చాలా మంది నేతలకు ఇప్పటికే హామీ కూడా ఇచ్చేశారు. ఇక కొన్నిచోట్ల టీడీపీ – జనసేన నాయకులు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సమన్వయ సమావేశాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామా తెరలేరనే టాక్ నడుస్తోంది.
ఈ సమావేశాల పేరుతో పవన్ పార్టీని కేవలొం 10 స్థానాలకే పరిమితం చేయాలని బాబు స్కెచ్ అని ఆ పార్టీ నేతలు లోలోపల మాట్లాడుకుంటున్నారు. ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనసేన అభ్యర్థులను రెండు వర్గాలుగా విభజించి, వారి మధ్య చిచ్చు పెట్టి చివరికి టీడీపీకే మెజార్టీ స్థానాలు దక్కేలా చేయడమే బాబు రాజకీయ ఎత్తుగడ అని సమాచారం. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు ఒకే అభ్యర్థి ఉంటే ఆయన్ని ఎలా దెబ్బతీయాలి లేదంటే టీడీపీకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అన్నది తెలుసుకోవడమే లక్ష్యమని తెలుస్తోంది. ఇక టీడీపీ ఎత్తుగడ అర్ధమైన కొంతమంది జనసేన నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. ఎందుకంటే చివరి వరకు టికెట్‌పై ఆశలు కల్పించి హ్యాండ్ ఇస్తే మొహం చూపించుకోలేని పరిస్థితి ఉండటంతో పవన్‌తో కొంతమంది నేతలు గ్యాప్ మెయింటేన్ చేస్తూ వస్తున్నారు.ఇక జనసైనికులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో ఎన్నికల టైం వరకు పవన్‌తో మిగిలేది ఎవరు, ఆయన వెంట నడిచేది ఎవరు, అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేది తెలియనుంది. మొత్తంగా బాబు పొలిటికల్ గేమ్ ప్లాన్‌లో పవన్ ఓ పావులా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
