- Advertisement -

ఏపీలో ఇంధన కొరత..బంక్‌లకు క్యూ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఇంధన కొరత తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తుండగా, అనేక చోట్ల బంకులను మూసివేస్తున్నారు.

ఇంధన కొరత ఎంత తీవ్రంగా ఉందంటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తరలించే 108 అంబులెన్స్‌లకు కూడా డీజిల్ దొరకని పరిస్థితి నెలకొంది.ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో అంబులెన్స్‌కు డీజిల్ పోయడానికి యాజమాన్యం నిరాకరించింది. నిన్నటి నుండి నాలుగు సార్లు బంకు చుట్టూ తిరిగినా చుక్క డీజిల్ లభించలేదని అంబులెన్స్ డ్రైవర్ గంగరాజు కన్నీరుమున్నీరయ్యారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ కొమ్మి కిషోర్ స్వయంగా రంగంలోకి దిగారు. వారు జిల్లాలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పెట్రోల్ బంక్ యాజమాన్యాలు అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేయవద్దని కలెక్టర్ ఆదేశించారు.

సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా జిల్లా యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.ప్రస్తుతం పంటల కోతల సమయం కావడంతో వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అవసరం భారీగా పెరిగింది.

నిన్న రాత్రి నుండి పెట్రోల్, డీజిల్ కోసం జనం బంకులకు పోటెత్తారు. దీంతో నిల్వలు వేగంగా నిండుకున్నాయి.అసలేం జరుగుతుందో తెలియక, ముందస్తుగా ఇంధనాన్ని నింపుకోవాలనే తొందరలో వినియోగదారులు క్యూ కడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -