- Advertisement -

కల్తీ మద్యంతో ప్రజల జేబులకు చిల్లు!

- Advertisement -

వాట్సాప్ లో మెసేజ్ పెడితే మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు… ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా కల్తీ మద్యంతో కూటమి నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి.

అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఒక వ్యవహారం బయటపడింది… కూటమి ప్రభుత్వంలో లక్షల మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, నకిలీ మద్యం తయారు చేస్తున్నారు అని ఆరోపించారు. స్టిక్కర్ల నుంచి బాటిల్స్ దాకా తయారు చేస్తూ రోజుకు వేలాది కేసుల కల్తీ మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు… ఏమీ జరగకపోయినా గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేస్తూ, సిండికేట్ ద్వారా కల్తీ మద్యాన్ని సప్లై చేస్తూ, దోపిడీ చేస్తున్నాడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మంచి మద్యం అందిస్తాను అని చెప్పడు అన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు మాత్రం నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పాడు… తన వారికే మద్యం దుకాణాలు వచ్చేలా సిండికేట్ ఏర్పాటు చేశాడు అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారవుతోంది, తయారు చేస్తున్నది తెలుగుదేశం నాయకుడు. నకిలీ మద్యం తయారు చేయడం, పంపిణీ దాకా అంతా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తయారై, రాయలసీమ అంతా వెళుతోంది. నకిలీ మద్యం డబ్బు అంతా చంద్రబాబు, తెలుగుదేశం నేతల జేబుల్లోకి వెళ్లింది? అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -