ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సాగు దారుణంగా తగ్గిపోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.ఆయన మాట్లాడుతూ, “పీఎం కిసాన్ కాకుండా రైతులకు రూ.20,000 ఇస్తామని చెప్పి, అదీ ఒక్కసారే ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు అన్నారు.
ఇప్పటివరకు ఈ ప్రభుత్వం కరువు మండలాలను కూడా ప్రకటించలేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు” అని ఆరోపించారు. అందుకే అరటి రైతులకు ధైర్యం చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్తున్నారని తెలిపారు.
లా అండ్ ఆర్డర్ విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థానం చిట్టచివరకు వచ్చింది. దీన్ని మరెంత దిగజారుస్తారో అర్థం కావడం లేదు” అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు అధికార పార్టీ వైపు కాకుండా ప్రజల వైపు, న్యాయం వైపు నిలబడాలని ఆయన సూచించారు. ప్రశ్నించే వాళ్లు లేరని అధికారులు తప్పు చేస్తే, వారి తప్పులన్నీ రికార్డు అవుతున్నాయని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
