Saturday, May 4, 2024
- Advertisement -

కర్నూల్..ఈసారి వైసీపీ క్లీన్ స్వీపేనా!

- Advertisement -

2019లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది వైసీపీ. జగన్ సునామీలో టీడీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఇందులో కర్నూల్ ఒకటి. సీమలో తన పట్టు నిలుపుకున్నారు జగన్. ఉమ్మడి కర్నూల్ జిల్లాల్లో 14 అసెంబ్లీ స్థానాలుండగా 14 వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి.

కర్నూలు, పాణ్యం, నంద్యాల, శ్రీశైలం, నందికట్కూరు, కొడుమూరు, యమ్మిగనూరు, ఆలురు, మంత్రాలయం, ఆదోని, డోన్, పత్తికొండ, బనగానపల్లి, ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్థులు తిరుగులేని మెజార్టీతో విజయం సాధించగా ఈసారి కూడా క్లీన్ స్వీప్ పక్కా అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొన్నిచోట్ల సిట్టింగ్‌లకు సీటు ఇస్తే మరికొన్ని చోట్ల అభ్యర్థులను మార్చారు జగన్. అన్ని సమీకరణాలను పరిశీలించాకే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఇక కర్నూలు సిటీలో మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ ను బరిలో నిలిపారు. ఇక్కడ టీడీపీ నుండి టీజీ భరత్ పోటీ చేస్తుండగా ఇంతియాజ్ మాత్రం సామాన్య ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి ఆ పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తీరే ఇబ్బందికరంగా మారింది.

పాణ్యం, ఎమ్మిగనూరు, ఆదోనిలో వైసీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి మరోసారి కర్నూల్‌ లో వైసీపీ గెలుపుకు బాట వేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -