ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఒకేసారి వచ్చారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. వైసీపీ రెబల్ ఎంపీగా మారి జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్ఆర్ఆర్ ఆ తర్వాత టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఈ నేపథ్యంలో ఇద్దరూ ఎదరుపడగా హాయ్ జగన్ అంటూ పలకరించారు రఘురామ కృష్ణంరాజు. జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు. ప్రతిరోజు అసెంబ్లీకి రా అని జగన్‌కు సూచించగా అసెంబ్లీకి రెగ్యులర్ వస్తా.. మీరే చూస్తారుగా అని బదులిచ్చారు జగన్. తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను కోరారు. ఇక సభలో జగన్ పక్కనే కూర్చున్నారు రఘురామ. ఈ క్రమంలో రఘురామ .. జగన్ చెవిలో ఏదో చెప్పడం కనిపించగా ఆ వెంటనే జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక అంతకముందు రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులతో సభకు హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. ఈ సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేసి ఎమ్మెల్యేల చేతిలో పేపర్లను చింపేందుకు ప్రయత్నించగా జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కానీ అధికార పక్షానిని సెల్యూట్ చేయడానిక కాదని అధికారం ఎప్పుడు ఒకరిదే ఉండదని మండిపడ్డారు.
