- Advertisement -

విచారణకు హాజరు కాలేను..కాకాణి లేఖ!

- Advertisement -

నేడు విచారణకు హాజరు కాలేనంటూ కోవూరు పోలీసులకు లేఖ రాశారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఈ లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కావడం సాధ్యం కాదని పేర్కొంటూ, ఈ నెల 27వ తేదీన విచారణకు తప్పకుండా వస్తానని తెలిపారు.

గుమ్మల దిబ్బ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక మృతి కేసులో నిరాధార ఆరోపణలు చేశారనే ఆరోపణలపై గత నెల 8వ తేదీన కొవ్వూరు పోలీస్ స్టేషన్‌లో కాకాణిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఇప్పటికే ఈ కేసులో విచారణ రెండు సార్లు వాయిదా పడింది. నేడు కూడా హాజరు కాలేనని తెలియజేయడంతో మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. పోలీసు వర్గాలు ఆయన లేఖను స్వీకరించినట్లు తెలిపాయి. 27వ తేదీన ఆయన హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -