అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. వేలం పాటలో గణనాథుని లడ్డూని లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ కోసం 31 మంది పోటీపడగా రూ.35 లక్షలకు దక్కించుకున్నారు దశరథ్ గౌడ్.
ఈ ఏడాది కొత్తగా వేలంపాట పోటీలోకి చంపాపేట్ కు చెందిన మర్రి కిరణ్ రెడ్డి, జిట్టా పద్మ సురేందర్ రెడ్డి, ఎల్బీ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి, కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, కొత్తగూడెంకు చెందిన సామ రామ్ రెడ్డి, హైదరాబాద్ కు చెందిన పీఎస్కే గ్రూప్స్ ప్రధానంగా పోటీపడ్డారు.
గత ఏడాది రూ.30,01,000లకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. గత 31 ఏళ్లుగా బాలాపూర్ లడ్డూ వేలం జరుగుతోండగా 1994లో తొలిసారి వేలంలో రూ.450 పలికింది లడ్డూ. 2016లో కందాడి స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల రూపాయలకు అమ్ముడైంది. 2017లో ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 15.60 లక్షల రూపాయల రికార్డు ధరకు విజన్ ఇండియా ఎండీ నాగం తిరుపతి రెడ్డి సొంతం చేసుకున్నారు.2018లో ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు.2021లో లడ్డూ రూ.18.90 లక్షలకు అమ్ముడుపోయింది. ఈ లడ్డూను మర్రి శశాంక్ రెడ్డి, రమేష్ యాదవ్ దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు కొలన్ శంకర్ రెడ్డి. ఈసారి గత ఏడాది కంటే ఎక్కువగా రూ.4.99 లక్షలు ఎక్కువగా పలికింది లడ్డూ.
