- Advertisement -

మేమంతా హిందువులమే..కొండా క్లారిటీ!

- Advertisement -

శ్రీరాముడిపై చేసిన కామెంట్లకు వివరణ ఇచ్చారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా అని అన్న విషయాన్ని తప్పుదోవ పట్టించారు..నేను చెప్పింది మొత్తం పక్కనపెట్టి, రాముని అంశం మాత్రమే ప్రచారం చేస్తున్నారు అన్నారు.

మేమంతా హిందువులమే.. ఇంట్లో నుండి బయటకు వచ్చే ముందు దేవుణ్ణి మొక్కుకొని, బొట్టు పెట్టుకొని బయటకు వస్తాను. నాకు రామాయణం తెలుసు, రాముడు నాకు దేవుడే…మా దగ్గర భద్రాచలం ఉంది, రాముని కోసం మా సీఎం 300 కోట్లు ఇచ్చారు అన్నారు.

మీరు కనీసం రూ.700 కోట్లు ఇచ్చి రాముని భక్తి నిరూపించుకోండి…ఏదో విమర్శలు చేసి నన్ను రాముడిని తిట్టినట్లు ప్రచారం చేయొద్దు అన్నారు. నేను అన్న మాట వేరు, మీరు ప్రచారం చేసింది వేరు…ప్రజల గురించి, రైతుల గురించి పట్టదు.. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించాను అన్నారు.

సమాధానం చెప్తే చెప్పండి లేదంటే నోరు మూసుకొని కూర్చోండి… అంతేగానీ తప్పుడు ప్రచారం చేస్తే బాగుండదు అని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -