మచిలీపట్నంలో ఇళ్ల కూల్చివేతల ఘటనపై రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.మచిలీపట్నం ఆరో వార్డులో మున్సిపల్ అధికారులు పలు ఇళ్లను కూల్చివేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ఘటనపై స్పందించిన పేర్ని నాని, బాధితులను ప్రత్యక్షంగా పరామర్శించి వారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.అసిస్టెంట్ కమిషనర్ గోపాల్ రావుపై పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు:
నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను… ఏపీలో ఎక్కడ ఉన్నా కనుగొంటాను. అవసరమైతే తెలంగాణ వెళ్లి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా సరే నీ ఇంటి విషయం చూస్తా అంటూ హెచ్చరించారు.
ఈ సందర్భంగా మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర, పోలీసులు, అధికారుల తీరుపై కూడా పేర్ని నాని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇళ్ల కూల్చివేతలు చేయడం అన్యాయమని విమర్శించారు.ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
