- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబుని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. చిత్తూరు – కుప్పంలో.. స్వయంగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యార్థుల బతుకు విలువ ఇదేనా? అని మండిపడ్డారు.
స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్‌లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు!, తల్లిదండ్రుల ఆవేదన: “చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?” చెప్పాలన్నారు. ఇది విద్యాలయమా? లేక శిక్షా శిబిరమా? నారా లోకేశ్ గారు, పేద పిల్లల భవిష్యత్తు దృష్టి లో పెట్జుకొని ఇప్పటికైనా విద్యాశాఖ పై దృష్టి పెట్టండి అని సూచించారు.
