- Advertisement -

నటి ప్రత్యూష మృతి కేసు..ఫైనల్ తీర్పు

- Advertisement -

టాలీవుడ్ నటి ప్రత్యూష (Prathyusha) మృతి కేసులో దాదాపు 24 సంవత్సరాల తర్వాత కీలక మలుపు తిరిగింది. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఈ కేసుపై సుప్రీం కోర్టు( Supreme Court) తుది తీర్పు వెలువరించింది. హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ, నిందితుడు సిద్దార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

ఈ కేసులో సిద్దార్థ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొదట నాంపల్లి కోర్టు అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించగా, తరువాత హైకోర్టు ఆ శిక్షను రెండున్నరేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సిద్దార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరోవైపు ప్రత్యూష తల్లి సరోజిని శిక్షను పెంచాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

గత ఏడాది నవంబరులో విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు, తీర్పును రిజర్వ్ చేసి నేడు వెల్లడించింది. దీంతో రెండు దశాబ్దాలుగా సాగిన న్యాయపోరాటానికి ముగింపు పలికినట్లైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -