- Advertisement -

టీడీపీ – బీజేపీ…పొత్తులో సీట్ల మార్పు!

- Advertisement -

టీడీపీ -బీజేపీ -జనసేన కూటమిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల రేసులో వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండగా ప్రచారంలో దూసుకుపోతున్నారు జగన్. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ సైతం ప్రచారం చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థులు సొంత పార్టీ నేతలపై రెబల్‌గా పోటీ చేసేందుకు రెడీ కావడంతో అసంతృప్తులను బుజ్జగించడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది.

అలాగే టీడీపీకి కేటాయించిన ఓ స్థానం బీజేపీకి, బీజేపీకి కేటాయించిన ఓ స్థానం టీడీపీకి మార్పు చేస్తారనే ప్రచారం జరుగుగోంది. అనపర్తి స్థానాన్ని తొలుత బీజేపీకి ఇవ్వగా ఇప్పుడు ఈ స్థానంలో టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లిని పోటీకి దింపాలని భావిస్తున్నారట చంద్రబాబు. అనపర్తి స్థానానికి బదులు తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని భావిస్తోంది టీడీపీ.

తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తండగా ఇక్కడ బీజేపీ నుండి నల్లారి కిరణ్ కుమార్ బరిలో ఉన్నారు. తంబళ్లపల్లె స్థానానికి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరును బీజేపీ పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రానున్నట్లు ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -