Saturday, May 4, 2024
- Advertisement -

బీజేపీకి,ఈటలకు మరో షాక్..బీఆర్ఎస్‌లోకి తుల ఉమ!

- Advertisement -

తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అత్యంత ఆప్తురాలు, బీసీ నేత తుల ఉమా రాజీనామా చేశారు. తొలుత బీజేపీ ఆమెకు వేములవాడ టికెట్ కేటాయించింది. కానీ చివరి నిమిషంలో ఆమెను కాదని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు తనయుడు వికాస్‌కు టికెట్‌తో పాటు బీ ఫామ్ ఇచ్చింది. దీంతో ఈటలతో పాటు తుల ఉమా షాక్ అయ్యారు. తనకు టికెట్ రాకపోవడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.

తన అనుచరులతో భేటీ అనంతరం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానిక రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆమె బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక తన రాజీనామా లేఖలో బీజేపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు ఉమ.ఇది నా ఒక్కదానికి జరిగిన అవమానం కాదని… గొల్ల కురుమ జాతికి జరిగిన అన్యాయం అని చెప్పారు. యావత్‌ తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమల ఆగ్రహానికి మీ నిర్ణయం కారణమైందని వెల్లడించారు. తనతో పాటు ఎందరో బీసీ నాయకులకు బీజేపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారిణిగా, ఓ బీసీ బిడ్డగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్‌ ప్రజలకు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా కూడా సేవ చేసే భాగ్యం లభించిందని తెలిపింది. ఆమె తిరిగి సొంతగూటికి బీఆర్ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే ఈటల వెంట ఉన్న నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా తుల ఉమ మాత్రం బీఆర్ఎస్‌లో చేరుతుండటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -