Saturday, May 4, 2024
- Advertisement -

బీజేపీలో కేసీఆర్ మొక్క..ఈటల రాజేందరేనా?

- Advertisement -

బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ ఒకటేనా…?పార్టీలు వేరు కానీ ఎజెండా ఒక్కటేనా…?బీజేపీలో సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేసే మనుషులున్నారా..?కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి…ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక ఆమె పార్టీలో చేరిన ఒక్క రోజులోనే కీలక బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారం,ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్టినేటర్ గా విజయశాంతిని నియమించింది. అలాగే 15 మంది కన్వీనర్లను ప్రకటించింది.

ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి స్పందించారు విజయశాంతి. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆమె…బీజేపీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని అందుకే తాను ఆ పార్టీకి గుడ్ బై చెప్పానన్నారు.ఇక కేసీఆర్ తనకు దేవుడిచ్చిన అన్న అని చెప్పలేదని…ఆయనే తాను దేవుడిచ్చిన చెల్లెలు అని చెప్పారని తెలిపారు. బీజేపీ కేసీఆర్ ను గద్దె దింపుతుందని భావించాను కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు.

సరిగ్గా ఎన్నికల సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చి పెద్ద తప్పు చేసిందని…దానిని తాను వ్యతిరేకించానని చెప్పారు. బీజేపీలో కేసీఆర్ నాటిన ఓ మొక్క అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మొక్క మాటలు నమ్మే బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుండి తొలగించారని మండిపడ్డారు. ఇక ఇప్పుడు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీలో కేసీఆర్ మొక్క ఈటల రాజేందరేనా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -