- Advertisement -

బోట్ల దందా..సీఎం చంద్రబాబుపై ప్రజల ఆగ్రహం!

- Advertisement -

ఓ వైపు వరదలతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు కొంతమంది నీచపు దందాకు తెరలేపారు. బోటు ఎక్కాలి అంటే రూ. 20 వేలు డిమాండ్ చేయడంపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే తమకు గూడు లేకుండా అల్లాడుతున్న పరిస్థితుల్లో వేలా రూపాయలు ఎలా కడతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ సింగ్ నగర్‌లో వ్యాపారస్థులు, హోటల్ నిర్వాహకులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహారాన్ని సేకరించి బ్లాకులో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజులుగా పంపిణీ చేస్తున్న ఆహారం అందడం లేదని చెబుతున్నారు. కొంతమంది ఒక్క వాటర్ బాటిల్ రూ.200కి అమ్ముతుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి తిండి కూడా దొరకడం లేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు.

ఇదో దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ ఛీ కొడుతున్నారు ప్రజలు. కోరి ఓట్లు వేయించుకుని మాకు ఇలా నరకం చూపిస్తోందని పలు మీడియా ఛానళ్ల ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు వర్షాలతో 19 మంది చనిపోయారని అధికార లెక్కలే చెబుతున్నాయి. ఇక ఆస్తి నష్టం అన్నది లెక్కేలేదు. ప్రభుత్వం వరద బాధితులకు ఆహారం మాట అటుంచితే కనీసం మంచినీళ్లు ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబడుతున్నారు.

ఇక ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం నుండి బయటపడుతోంది విజయవాడ. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -