విజయవాడ ఉగ్రలింకుల కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ కేసులో మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, తెలంగాణ సహా మొత్తం 7 రాష్ట్రాల్లో 9 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించారు.ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
నిందితుల వివరాలు
A1 అబ్దుల్ సలాం
A4 దిల్షాన్ (బీహార్)
A5 సైదా బేగం (హైదరాబాద్)
A6 అల్ హకీమ్ షుకూర్ (విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్)
A7 లక్కీ అహ్మద్ (ఢిల్లీ)
A8 అస్మానుల్లా ఖాన్ (బీహార్)
A9 జీషన్ (రాజస్థాన్)
A10 మీరా ఆసిఫ్ అలీ (పశ్చిమ బెంగాల్)
A11 అబ్దుల్ సలాం (బళ్లారి, కర్ణాటక)
A12 షారుక్ ఖాన్ (మహారాష్ట్ర)
A13 షేక్ ఫజుర్ రెహమాన్ (మహారాష్ట్ర)గా కేసు నమోదు చేశారు.
A6గా గుర్తించిన అల్ హకీమ్ షుకూర్ విదేశాల్లో ఉండి ఈ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసుకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
ఈ కేసులో ఇంకా పలు కోణాల్లో విచారణ జరుగుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ కేసు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర మరియు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
