- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చారు టీచర్లు. ఏకంగా చంద్రబాబు ఇంటి ముందే టీచర్లు నిరసనకు దిగారు. యోగాంధ్ర గిన్నీస్ రికార్డ్ అనంతరం రోడ్డెక్కారు యోగా టీచర్లు. కరకట్ట వద్ద సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు యోగాసనాలతో నిరసన వ్యక్తం చేశారు.
పాఠశాలల్లోని 1056 మంది యోగ టీచర్ల కు న్యాయం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అయితే ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు. యోగ టీచర్ల కు న్యాయం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
