- Advertisement -

భగవాన్ మహావీర్‌కు జగన్ నివాలి

- Advertisement -

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ … మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్‌కు నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా జగన్ సోషల్ మీడియా వేదిక X ద్వారా సందేశం పంచుకున్నారు. భగవాన్ మహావీర్ గొప్ప ఆధ్యాత్మిక గురువు. అహింస, సత్యం, అపహరణ చేయకపోవడం, బ్రహ్మచర్యం, అసంగ్రహం అనే ఐదు ముఖ్య వ్రతాలను ప్రజలకు బోధించారు. ఆయన చూపిన మార్గం ఎప్పటికీ ప్రాసంగికమే. మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్‌కే రోజా, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎస్‌వీ సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కోఠారి, కుందన్ గాంధీ , ప్రవీణ్ ఫౌలముత్తా , ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -