- Advertisement -

వైసీపీ నేత కారుమూరు అరెస్ట్..అక్రమం

- Advertisement -

వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్‌ ఇంట్లో ఉదయం 7 గంటలకు అరెస్టు చేశారు పోలీసులు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేశారని, ఫోన్లను లాక్కొని, అమానుషంగా ప్రవర్తించారంరని వెంకట్‌ రెడ్డి భార్య ఆరోపించారు. సీఐ మృతిపై ఎక్స్‌లో పోస్ట్ చేసినందుకు వ‌చ్చామ‌ని చెప్పి అరెస్ట్ చేశారు అని తెలిపారు. ‘

వైసీపీ నేత కారుమూరి వెంకట రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేశారు … ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారం కూడా ఇవ్వలేదు అన్నారు.

వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి మీద కక్ష పెట్టుకుని అకారణంగా అరెస్ట్ చేయడం దారుణం … ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది …
డీజీపీ, జిల్లా ఎస్పీ లకు ఫోన్ చేస్తే ఎత్తరు అని మండిపడ్డారు.

కారుమూరి వెంకట్ రెడ్డిని ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కారుమూరి వెంకట రెడ్డి భార్య హరిత, వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -