- Advertisement -

టీడీపీ- జనసేన పొత్తు…ఆ వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తుతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించనున్నాయా…?టీడీపీ -జనసేన నేతల్లో నూతనోత్సాహం నిండిందా..?అదే సమయంలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన,వైసీపీ త్రిముఖ పోరులో లాభపడింది వైసీపీనే. ఎందుకంటే దాదాపు 42 స్ధానాల్లో 1000 ఓట్ల కంటే తక్కువ తేడాతో వైసీపీ గెలుపొందింది. ఇక కొన్నిచోట్ల 500 లోపే ఓట్లతో విక్టరీ సాధించింది. దీనికి కారణం టీడీపీ – జనసేన ఓట్లు చీలడమే. దీంతో ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా టీడీపీ – జనసేన నేతలు ముందుగానే ఒకటయ్యారు.

అయితే ఆ ఎన్నికల్లో అలా వైసీపీ గెలిచిన స్థానాలను ఓ సారి పరిశీలిస్తే…. విజయవాడ సెంట్రల్ స్ధానంలో వైసీపీ కేవలం 25 ఓట్ల తేడాతో గెలుపొందింది. అలాగే ఉభయగోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం,కర్నూల్,నెల్లూరు జిల్లాల్లోని పలు స్థానాల్లో 1000 ఓట్ల తేడాతోనే గెలుపొందింది.ఇక కొన్ని స్ధానాల్లో అయితే కేవలం 500 ఓట్ల మార్జిన్‌తోనే విక్టరీ సాధించారు వైసీపీ అభ్యర్థులు. అయితే తాజాగా చంద్రబాబు – పవన్ కలిసే ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఈసారి ఓట్లు చీలే అవకాశం తక్కువ. దీంతో ఇప్పుడు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందని తెలుస్తోంది.

జగన్‌ టార్గెట్‌గా చంద్రబాబు – పవన్‌ తమ మధ్య వైరుధ్యాన్ని సైతం పక్కనపెట్టి కలిసి పనిచేయనున్నారు. ఇక జనసేన కార్యకర్తలు సైతం ఈ సారి అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం ఎలాగైనా ఉండేలా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల ఓట్లు చీలడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఎత్తుగడ ఎలా ఉండనుందోనని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో జగన్ ఈ 42 స్ధానాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తే వైసీపీకే మేలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్షేమ పథకాల రూపంలో ప్రజల్లో వైసీపీకి మంచి ఆదరణే ఉంది. దీనికి తోడు స్థానికంగా ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరిండం ద్వారా వైసీపీకే మేలు జరుగుతుందని పార్టీ నేతలు సైతం భావిస్తుండగా పొలిటికల్ ఎనలిస్టులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -