- Advertisement -

పవన్‌తో అల్లు శిరీష్..!

- Advertisement -

నటుడు అల్లు శిరీష్ వివాహ వేడుకలు సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మార్చి 6, 2026న నయనికా రెడ్డితో శిరీష్‌ వివాహం జరగనుండగా ఇప్పటికే పెళ్లి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సన్నిహిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో సంప్రదాయ కార్యక్రమాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి.

వివాహ ఆహ్వాన కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఆయన సతీమణి మరియు అల్లు శిరీష్ కలిసి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను స్వయంగా ఆహ్వానించారు. ఆ సందర్భానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఆయన సతీమణి అన్నా లెజ్నేవాలను కూడా అల్లు కుటుంబం ఆహ్వానించింది.

ఇక పెళ్లి ముందురోజు వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ సన్నిహితులకు, సినీ ప్రముఖులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -