అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ పాయింట్‌ని దాటేసింది.
ఇక భగవంత్ కేసరి సక్సెస్‌ని సైతం సెలబ్రేట్ చేసుకుంది చిత్ర యూనిట్. ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు అనిల్…ఈ మూవీ సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందరినుండి సినిమా సీక్వెల్ తీయాలనే డిమాండ్ వస్తుందని అయితే దానిపై ఇప్పుడే ఏం చెప్పలేనని తెలిపారు. ఒకవేళ భవిష్యత్‌లో సీక్వెల్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మరింతగా ప్రేక్షకులను అలరించేలా తీస్తానని తెలిపారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించగా తమన్ సంగీతం అందించారు.
