- Advertisement -

‘రాజా శివాజీ’..ప్రభంజనం

- Advertisement -

బాలీవుడ్ మరియు మరాఠీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆరంభాన్ని పొందింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది.

ఈ చిత్రం మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.23.90 కోట్ల నెట్ వసూళ్లను సాధించిందని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రితేష్ ఈ సినిమాతో తన సత్తా చాటారు. శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. మరాఠీ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా ‘రాజా శివాజీ’ నిలిచింది. మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.

అజయ్-అతుల్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అత్యున్నత సాంకేతిక విలువల తో ఈ సినిమాను నిర్మించారు.వీకెండ్ కావడంతో మూడవ రోజు కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ చిత్రం త్వరలోనే రూ.50 కోట్ల మార్కును చేరుకుంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -