Wednesday, May 22, 2024
- Advertisement -

విచారణలో రవితేజను అధికార్లు అడిగే ప్రశ్నలు ఇవే

- Advertisement -

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ 12 మంది సినీ ప్రముఖులకు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఇప్పుడు వారి విచారణ కోనసాగుతోంది. నోటీసులు అందుకున్న వారిలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఉండటంతో.. ఆయన శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి రవితేజ చేరుకుంటే.. అరగంట తర్వాత విచారణ ప్రారంభించారు అధికారులు.

డ్రగ్స్ కేసులో రవితేజ పాత్రపై ఆరాతీయడానికి రెడీ అయిన అధికారులు.. పూరి, సుబ్బరాజు, నవదీప్, చార్మి, ముమైత్ ఖాన్ ల నుంచి తీసుకున్న వాంగ్మూలాలను అతడు ఇచ్చే సమాధానాలతో సరి పోల్చనున్నారు. విచారణలో భాగంగా.. కెల్విన్ జిషాన్‌లతో రవితేజ పరిచయాలపైనే తొలి రెండు గంటలూ ఆయన్ను ప్రశ్నించాలని అధికార్లు భావించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ప్రశ్నలను సిద్దం చేసుకున్నారు. కెల్వినే స్వయంగా జిషాన్‌ను పరిచయం చేశాడా? అయితే వీరి నుంచి ఎందుకు మీకు ఫోన్లు వచ్చాయి? విల్సన్ తో మీరు డ్రగ్స్ కోసమే మాట్లాడేవారా? మీ డ్రైవర్ శ్రీనివాస్ ఎక్కడ నుంచి డ్రగ్స్ తెచ్చి ఇచ్చేవాడు? దక్షిణాఫ్రికా నుంచి మీకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు? డ్రగ్స్ కొనుగోలుకు ఎంత డబ్బు వెచ్చించేవారు? ఏ రూపంలో దాన్ని చెల్లించేవారు?

కెల్విన్‌తో కలసి పార్టీలకు ఎందుకు వెళ్లారు? పార్టీలు ఎక్కడ జరిగేవి? పార్టీల్లో డ్రగ్స్ తీసుకునేవారా? డ్రగ్స్‌కు ఆర్డర్ ఇచ్చేది ఎవరు? షూటింగులు లేకపోయినా బ్యాంకాక్‌కు ఎందుకు వెళతారు? డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో మీకు ఎలాంటి సంబంధాలున్నాయి? ఆయనతో కలిసి డ్రగ్స్ సేవించేవారా? అసలు పూరి మీకు డ్రగ్స్ అందించాడా? జిషాన్ ఎప్పటి నుంచి పరిచయం? ఆరేళ్ల నుంచే మీరు డ్రగ్స్ వాడుతున్నారా? తదితర ప్రశ్నలను రవితేజ అడగనున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -