వెలగపూడి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమె అక్కడ నేనిక్కడ ఉంటున్నామని వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాట అన్నది ఆయన సతీమణి గురించి. నా భార్య హైదరాబాద్‌లో నేను ఇక్కడ ఉంటున్నామని సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ అన్నారు. అంతే దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వేశారు.
అయితే ఆయన ఇలా ఎందుకు అన్నారు? కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు కలిసి వెలగపూడిలోని సచివాలయ భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఇరువురు ఉద్యోగులతో కొంతసేపు సంభాషించారు. ఈ సమయంలో ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. భార్యాపిల్లలు హైదరాబాద్‌లో ఉంటే తాము ఇక్కడ ఉండాల్సి వస్తోందని అన్నాడు.
దీంతో వెంటనే స్పందించిన సీఎం రాష్ట్ర విభజన బాధితుల్లో తానూ ఒకడినని, నా భార్య హైదరాబాద్‌లో ఉంటే.. నేను ఇక్కడ ఉంటున్నానని అన్నారు. చంద్రబాబు అలా అనడంతో అక్కడ ఉన్నవారంతా సరదగా నవ్వుకున్నారు.
