Thursday, May 9, 2024
- Advertisement -

పీకె స‌ల‌హాదారుడు మాత్రమే… పోటీ జ‌గ‌న్ – బాబు మ‌ధ్యే…

- Advertisement -
AP Minister Devineni Uma Speak on political expert Prashant Kishor

అధికార పార్టీ టీడీపీ నాయ‌కుల్లో వ‌ణుకు మొద‌ల‌య్యింది.2019 ఓడిపోతామ‌నే భావ‌న‌తోనే ఇష్ట‌మొచ్చిన‌ట్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధించటం కోసం ప్రశాంత్ తో ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం తెలిసిందే.అందుకే ప్రశాంత్ గురించి టిడిపి నేతలు వీలైనపుడల్లా చులకనగా మాట్లాడుతున్నారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటేనే టిడిపి నేతలు భయపడుతున్నారు. ప్రశాంత్ అంటే టిడిపి ఎందుకంత భయపడుతోందంటే ప్రశాంత్ కున్న ఇమేజ్ అటువంటిది కాబట్టే. నిన్న‌టి వ‌ర‌కు తెర‌వెనుక ప‌నిచేసిన కిషోర్ ఇప్పుడు తెర‌ముందు త‌న ప‌నిని మొద‌లు పెట్ట‌బోతున్నారు.
పీకే ఎన్నిక‌ల రంగంలోకి దిగ‌డంతో అధికార పార్టీ నాయ‌కులకు ఓట‌మిభ‌యం ప‌ట్టుకుంది.ఇరిగేష‌న్ మంత్రి ఉమామ‌హేశ్వ‌ర్ మాట్లాడుతూ ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా తమకు ఏమీ కాదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రశాంత్ వ్యూహాలు విఫలమైన సంగతిని దేవినేని గుర్తు చేసారు. అయితే, మంత్రి మరచిపోయిన విషయం ఇక్కడ ఒకటుంది. యుపిలో ప్రశాంత్ విఫలమవ్వలేదు. ప్రశాంత్ వ్యూహాలను కాంగ్రెస్సే ఆచరణలో పెట్టలేకపోయింది. ఆ విషయాన్ని స్వయంగా రాహూల్ గాంధీనే మీడియాతో చెప్పారు.
మరి, ఇదే ప్రశాంత్ వ్యూహాలను ఆచరణలో పెట్టేకదా పంజాబ్ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతుకుముందు నరేంద్రమోడి, నితీష్ కుమార్ కూడా ప్రశాంత్ సేవలు వాడుకుని లాభపడ్డారు కదా? వారి సంగతిని మంత్రి ఎలా మరచిపోయిన‌ట్లున్నారు మంత్రివ‌ర్యులు. 2019 ఎన్నిక‌లుపోటీ చంద్రబాబునాయుడు-జగన్మోహన్ రెడ్డికి మధ్య అయితే సలహాలిచ్చే ప్రశాంత్ ను విమ‌ర్శించాల్సి ప‌నేంటో అర్థం కావ‌డంలేదు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}AgZkjiIkCrM{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -