- Advertisement -

ఏపీఎస్ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం

- Advertisement -

రాష్ట్ర విభజన అనంతరం ఏపీఎస్ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. ఇప్పటికే ఏడాది ఆలస్యమవుతున్న ఎన్నికల కసరత్తులో అటు యూనియన్లు, ఇటు యాజమాన్యం తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 7న అన్ని యూనియన్ల ప్రతినిధులతో రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. యాజమాన్యం, యూనియన్ ప్రతినిధుల నుంచి ఓటర్లు, ఎన్నికల ఏర్పాట్లు తదితర వివరాలను సేకరించనున్నారు. అనంతరం ఈ నెల 20న మరోమారు సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు.

జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని యూనియన్ నేతలు అంటున్నారు. ఎన్నికల ఏర్పాట్లకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుండగా యూనియన్లు ఇప్పటి నుంచే ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్), ఐఎన్టీయూసీ(పులి గుర్తు), ఐఎన్టీయూసీ(త్రాచు గుర్తు), భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్), కార్మిక పరిషత్(టీఎన్టీయూసీ), యునెటైడ్ వర్కర్స్ యూనియన్లు ఈ సారి పోటీకి సిద్ధమవుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. 2013 జనవరి నుంచి ఈయూ గుర్తింపు సంఘంగా కొనసాగుతోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అనేక కారణాలతో కాలయాపన జరిగింది. మొత్తం 57,700 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. 2015 డిసెంబర్ 31 నాటికి ఆర్టీసీలో ఉద్యోగం చేపట్టి ఆరు నెలలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కును కల్పించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -