పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదు విషయంలో సుప్రీం కోర్టులో విచారణ జరుగగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు ఉన్నది టీడీపీ వారే అని వెల్లడించింది. అంతేగాదు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి (ఏ7) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
రాజకీయ కక్షతో పెట్టిన కేసు ఇది….అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వల్లే జరిగిన హత్య ఇది. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించింది అని పిన్నెల్లి తరపు న్యాయవాది తెలిపారు. నిందితులంతా హత్యకు గురైన వ్యక్తి పార్టీ వారే కావడం విచిత్రం. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు పిన్నెల్లి బ్రదర్స్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
