Saturday, May 4, 2024
- Advertisement -

బరువు తగ్గాలనుకుంటున్నారా..వంకాయ తినాల్సిందే!

- Advertisement -

కరోనా, లాక్ డౌన్ తర్వాత ప్రజల జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆకు కూరలు, కూరగాయల వాడాకాన్ని బాగా పెంచారు. ఏ కూరగాయలు వాడితే ఏం ప్రయోజనం జరుగుతుందో అందరికి తెలిసిపోయింది. అందుకే తాము తినే ఆహారంలో సీ,డీ,ఈ విటమిన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక కూరగాయాల్లో ప్రధానంగా వంకాయది ప్రత్యేక స్థానం. వంకాయ తింటే వాతం అనే నానుడి ఉన్నా కూరగాయలలో వంకాయది ప్రత్యేక స్థానం. రుచిలోనూ వంకాయ ఇచ్చే కమ్మదనం ఇతర ఏ కూరగాయ కూడా ఇవ్వదు. వంకాయతో చేసే కూరలుగాని పచ్చళ్లు గాని ఎంత రుచిగా ఉన్నప్పటికి కొందరు వంకాయ తినడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు.

అయితే వంకాయతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె వంటివి అధికంగా ఉంటాయి. ఫైబర్, ఫోలెట్, మాంగనీస్, పొటాషియం, వంటి కనిజాలు కూడా మెండుగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు కూడా తప్పనిసరిగా వంకాయను ఆహార డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.వంకాయలో కొలెస్ట్రాల్ ను పెంచే కారకాలు ఉండవు కాబట్టి ఈజీగా బరువు తగ్గవచ్చు. వంకాయలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధిత వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వంకాయపై అపోహలు ఉన్నవారు తమ అభిప్రాయాన్ని మార్చుకుని నిరభ్యంతరంగా తినవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -