Monday, May 6, 2024
- Advertisement -

ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ సమస్యే!

- Advertisement -

మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం లివర్. మనం తినే ప్రతిదానిని ఎలా ప్రాసెస్ చేస్తుందో, చెడు పదార్థాలను ఫిల్టర్ చేయడంలో కీలక పాత్ర లివర్‌దే. ఒకవేళ లివర్ చెడిపోయిందంటే మనిషి బ్రతకడం చాలాకష్టం. కాలేయం సరిగా పనిచేయనప్పుడు…రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే లక్షణాలను కలిగిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కాలేయ వ్యాధిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. తద్వారా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు. జంక్ ఫుడ్, షుగర్ వినియోగం వల్ల పిల్లల్లో కాలేయ వ్యాధులు పెరుగుతాయి. కాలేయంలో కొవ్వు చేరడం ద్వారా. పెద్దలలో మూడింట ఒక వంతు మందికి కొవ్వు కాలేయం లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు.

రక్తంలో చక్కెర స్థాయిలు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తాయి. టైప్ 2 మధుమేహం కలిగి ఉండటం వల్ల మీ కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బరువు తగ్గడం, పక్కటెముకల కుడి వైపున నొప్పులు,నీరసంగా ఉండటం కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడానికి సంకేతం.

చర్మం లేదా కంటి తెల్లసొన పసుపు రంగులోకి మారడం కామెర్లు లక్షణాలు. అలసట , బలహీనత వంటివి కనిపిస్తాయి. అయితే కాలేయ వ్యాధిని ప్రారంభంలో గుర్తించడం కష్టం. జీవనశైలీలో మార్పులను గమనించడం ద్వారా కాలేయ సంబంధిత వ్యాధిని గుర్తించవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలతో సహా అనారోగ్యకరమైన కొవ్వు ఉన్న ఆహారాలను తీసుకోవద్దు. ఉప్పు మరియు చక్కెరను తగ్గించండి, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ కాలేయం దెబ్బతింటుంది. తగినంత నీరు త్రాగాలి. బరువు నియంత్రణలో జాగ్రత్త వహించాలని. అలాగే ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గిస్తే లివర్ ఆరోగ్యంగా ఉండటంలో సాయపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -