- Advertisement -

వైసీపీని దెబ్బతీసెందుకు బాబు ఇలా చేస్తున్నారా..?

- Advertisement -
Chandhrababu Target 2019

ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా చంద్రబాబు మనసులో ఏం ఉందో చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పక్కకు నెట్టి అధికారం దక్కించుకునే లక్ష్యంగా బాబు ఊహించని ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో రెడ్డి వర్గానికి ప్రాధాన్యతను కల్పించి రాయలసీమకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టడం వెనకాల జగన్ కు చెక్ పెట్టాలనే ఆలోచన బాబులో స్పష్టంగా కనబడుతుంది.

ప్రధానంగా వలస వచ్చిన నాయకుల్లో సమర్థులకు మంత్రి పదవి ఇవ్వడం వెనకల వలసలను మరింత ప్రోత్సహించి ప్రతిపక్ష నాయకులకు తమ పార్టీలో ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పకనే చెప్పడం జరిగింది. పార్టీకి విధేయులుగా ఉన్న వారిని  ఏ మాత్రం విస్మరించలేదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌బాబు వంటి నేతలకు మంత్రి పదవులిచ్చారు.

పార్టీలో క్రమశిక్షణకు పెద్ద పీట వేసి వ్యవహార శైలి సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నారు. తనయుడు లోకేశ్‌ను భావి నేతగా ఎక్స్ పోజ్‌ చేసేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలు పెట్టారు. లోకేశ్‌ వచ్చే రెండేళ్లలో మంత్రిగా సత్తా చాటుకుంటే.. 2024 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా రేసులో ఉండే చాన్స్ ఉంది. అందుకనుగుణంగా….ఆయా జిల్లాల్లో మంచి ఇమేజ్‌ ఉన్న నేతలకు మంత్రి పదవులిచ్చారు. ఇదంతా చూస్తుంటే లోకేష్ ని భవిష్యత్తులో సీఎం గా చేసి.. జగన్ అధికారాన్ని ఎక్కడానికి ఎక్కడా చిన్న అవకాశం లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -