లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిగా మారిపోయింది. ఈ సినిమాపై ఒకరి తర్వాత ఒకరు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదట సోమి రెడ్డి మొదలు పెడితే ఆ నిన్న జవహర్ వరకు ఒకరి తర్వాత వకరు మాట్లాడతనే ఉన్నారు. ఇందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తగిన సమాధానమే చెప్తున్నాడు.
అయితే దీనిపై కొద్ది సేపటి క్రితం ఏపీ చంద్రబాబు నాయుడు స్పందిచారు. మంగళవారం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. వర్మ తీయబోతున్న సినిమాపై అతిగా స్పందించవద్దని తెలుగుదేశం శ్రేణులకు సూచించారు. మహానేత ఎన్టీఆర్ కారణజన్ముడని అన్నారు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవను తెలుగుజాతి మరువదని అన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాంగోపాల్ వర్మను కలవడాన్ని తెలుగు ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వర్మ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తీస్తున్న సినిమాపై ప్రజలకు ఓ అవగాహన కూడా ఉందని చంద్రబాబు తెలిపారు.
వైసీపీ నేతలతో కలిసి వర్మ తీస్తున్న ఈ సినిమాపై టీడీపీ నేతలు, కార్యకర్తలు స్పందించాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు.. వర్మతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.
