Saturday, May 4, 2024
- Advertisement -

దాల్చిన చెక్కతో ఉపయోగాలు..అస్సలు వదలరు!

- Advertisement -

వంటింట్లో ఉండే దివ్యమైన ఔషధాల్లో ఒకటి దాల్చిన చెక్క. కొన్ని రకాల చెట్ల నుండి తయారైన సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క బెరడుతో పాటు ఆకులు, పువ్వులు, పండ్లు మరియు వేర్ల నుండి సేకరించిన పదార్ధాలు వేల సంవత్సరాల నుండి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దాల్చినచెక్కలో నాలుగు ప్రధాన రకాలు ఉన్నాయి. ముదురు-రంగు కాసియా దాల్చినచెక్క ఆగ్రేయ ఆసియాలో పెరుగుతుండగా దీనిని సిలోన్ దాల్చినచెక్క అని కూడా పిలుస్తారు.

దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీబయాటిక్ మరియు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి దాల్చినచెక్క వరం లాంటిది. పలు అధ్యయనాల్లో ఇదే నిరూపితమైంది. మధుమేహం ఉన్నవారిలో కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడం మరియు ఊబకాయం ఉన్న వారికి దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది.

దాల్చినచెక్కలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, మాంగనీస్, రాగి, జింగ్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీకూడా మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఉదయం పడగడుపున దాల్చిన చెక్కను వేడి నీటిలో మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నెలసరి ఉన్న మహిళలు ప్రతిరోజూ ఉదయం దాల్చిన చెక్క నీరు త్రాగడం వల్ల నెలసరిలో వచ్చే అన్నీ రకాల సమస్యలు దురమౌతాయి. పురుషుల్లో వచ్చే అంగస్తంభన సమస్యనూ కూడా తగ్గిస్తుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -