Thursday, March 28, 2024
- Advertisement -

మారిటైమ్ ఇండియా సమ్మిట్‌.. పెట్టు బడులకి సీఎం జగన్ పిలుపు..!

- Advertisement -

పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రం అనేక చర్యలు తీసుకుందని సీఎం జగన్‌ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన మారిటైమ్ ఇండియా సమ్మిట్‌లో ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. మారిటైమ్ ఇండియా విజన్- 2030 పత్రం కేంద్రప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.

ఏపీలోని పోర్టులు ఏటా 170 మిలియన్ టన్నుల సరకు రవాణాతో, గుజరాత్ తర్వాత రెండోస్థానంలో ఉన్నాయన్నారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్రం ప్రస్తుతం 4శాతం వాటా కలిగి ఉండగా.. 2030 నాటికి 10 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చెప్పారు.

పోర్టులు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా… తయారీ, పెట్రో కెమికల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫార్మాస్యూటికల్స్‌ లాంటి పోర్టు ఆధారిత రంగాల నుంచి భారీగా పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు చేపట్టాం. కేంద్రం సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్వా యూనివర్సిటీ…. టెస్టింగ్‌ ల్యాబ్‌లు, కోల్డ్‌ చైన్‌ లాంటి సదుపాయాల ఏర్పాటుతో 8 ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధి చేపట్టడమూ ఆక్వా రంగంలో కార్గో రవాణా పెరిగేందుకు ఉపకరిస్తుంది.

రాష్ట్ర తీర ప్రాంతమంతటా పోర్టు ఆధారిత పరిశ్రమలు, నూతన ఆర్థిక నగరాల అభివృద్ధికే ఈ చర్యలు చేపట్టాం. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, అందుకవసరమైన పూర్తి మద్దతు మీకు లభిస్తుందని హామీ ఇస్తూ, ఈ సదస్సులో పాల్గొంటున్న దేశ విదేశీ సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాను అని సీఎం జగన్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -