Saturday, May 4, 2024
- Advertisement -

మావోయిస్ట్ లకి పెద్ద షాక్ గా మారిన కరన్సీ మార్పిడి 

- Advertisement -
Maoists force elderly to convert black money in Jharkhand

ఇటీవల మల్కాన్ గిరిలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తో కుదేలైన మావోయిస్టు పార్టీకి తాజాగా `క్యాష్ కౌంటర్ కు గురైంది. 31మంది మావోలను కోల్పోయిన పార్టీ షాక్ లో ఉన్న తరుణంలో బడా నోట్ల రద్దుతో షాక్ మీద షాక్ ఇచ్చినట్లయ్యింది. వ్యాపారులు – పారిశ్రా మిక వేత్తల నుంచి విరాళాలు – బలవంతపు వసూళ్లతో మావోయిస్టులు నిధులు సమకూర్చుకోవడం అందరికీ తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం సంచలన రీతిలో రూ.500 – రూ.1000 నోట్లను ఆకస్మికంగా రద్దుచేయడంతో మావోయిస్టులతోపాటు ఇతర నక్సలైట్ గ్రూపులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయన్నది సమాచారం. రూ. 500 – 1000 పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో వారు వేసిన ఎత్తులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయని గిరిజనులు అంటున్నారు.

మావోలు తమ వద్ద ఉన్న బడా నోట్లను చెలామణి చేస్తున్న క్రమంలో పట్టుబడుతున్నారని జార్ఖండ్ పోలీసులు పేర్కొంటున్నారు. వివిధ రూపాల్లో వసూళ్ల ద్వారా సేకరించిన డబ్బును ఆదివాసీ గిరిజనుల సహాయంతో మార్చుకునేందుకు నక్సలైట్లు ప్రయత్నిస్తున్నట్లు ఈ క్రమంలో కొందరు చట్టానికి చిక్కినట్లు లతెహార్(జార్ఖండ్) ఎస్పీ అనూప్ బిర్తరే మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన లతెహార్ – చుట్టుపక్కల జిల్లాల్లో నక్సలైట్ల నోట్ల మార్పిడిపై నిఘా పెంచామని ఎస్పీ పేర్కొన్నారు. బ్యాంకులో జమచేసే మొత్తంపై ఆంక్షలున్న నేపథ్యంలో గిరిజనుల ద్వారా నక్సలైట్లు నగదును మార్చుకుంటున్నారని తెలిసింది.

కనీసం నోటు విలువను కూడా చెప్పలేని ఓ గిరిజన మహిళ రెండు రోజుల కిందట లతేహార్ లోని ప్రభుత్వ బ్యాంకుకు వచ్చి.. తన జనధన్ ఖాతాలో రూ.4.5 లక్షలు జమ చేసేందుకు ప్రయత్నించిందని అయితే బ్యాంక్ అధికారులు పాన్ కార్డు అడగటంతో కంగారుపడిన ఆమె.. డిపాజిట్ చేయకుండానే వెనుదిరిగి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మావోయిస్టు అనుబంధంగా అసోంలో పనిచేస్తున్న నక్సలైట్ గ్రూపు కూడా నోట్ల మార్పిడికి విఫలయత్నం చేసిందని ఈ క్రమంలో భారీ నగదు కలిగి ఉన్న ఇద్దరిని అరెస్ట చేశారని పోలీసులు పేర్కొన్నారు. నక్సలైట్లు పలువురిని బెదిరించి బలవంతపు వసూళ్ల ద్వారా డబ్బు సేకరిస్తారు కనుక అలాంటి సొమ్మును మార్పిడి చేసేందుకు సహకరించేవారు కూడా నేరస్తులే అవుతారని ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివారిని వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -