- Advertisement -

వాట్సాప్ మెసేజ్‌.. ఫోన్ హ్యాక్!

- Advertisement -

సైబర్ కేటుగాళ్లు రోజుకో రూపంలో పంజా విసురుతున్నారు. పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నా కేటుగాళ్లు మాత్రం ఏదో రూపంలో పంజా విసురుతూనే ఉన్నారు. తాజాగా ఏపీలో ఆర్టీవో చలాన్ పేరుతో కేటుగాళ్లు వల విసిరారు.

ఆర్‌టీవో చలాన్ ఏపీకే ఫైల్‌ను పంపిస్తూ వాహనదారులను టార్గెట్ చేస్తున్నారు. మీ వాహనంపై ఈ-చలాన్ నమోదైంది, వెంటనే చెక్ చేయకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలవుతుంది అనే బెదిరింపు సందేశంతో ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పొరపాటున ఈ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే వెంటనే ఫోన్‌లోని కాంటాక్టులు, మెసేజ్‌లు వంటి సమాచారం హ్యాకర్లకు చేరిపోతోంది. ఇంకా, ఆ ఫోన్ నుంచి ఇతర కాంటాక్టులకు కూడా అదే మాల్వేర్ ఆటోమేటిక్‌గా షేర్ అవుతోంది. తర్వాత ఫోన్ హ్యాంగ్ అవడం, వాట్సాప్ పనిచేయకపోవడం, బ్యాటరీ వేగంగా తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఫోన్ ఇప్పటికే ఇన్‌ఫెక్ట్ అయితే వెంటనే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లి మాల్వేర్‌ను తొలగించుకోవాలని, అవసరమైతే సాఫ్ట్‌వేర్‌ను రీ-ఇన్‌స్టాల్ చేయించుకోవాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -