- Advertisement -

ఏపీలో అత్యాచారం చేసిన ఆ ఇద్దరు మంత్రులెవరో తెలుసా?

- Advertisement -
do you know the two minister in ap who raped

వైజాగ్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాబినెట్‌లో అత్యాచారం చేసిన ఆ ఇద్దరు మంత్రులెవరు? ఇప్పుడిదే చర్చ పలువురి మధ్య నడుస్తోంది. ఇలా ఎందుకు అనుకుంటున్నారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మామూలే.

అయితే తాజాగా ఏకంగా అత్యచార విమర్శలు రావడంతో పలువురిని ఆలోచనలో పడేసింది. ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వైజాగ్‌లో ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరిట ప్రత్యక సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ ఏపీ మంత్రులపై సంచలన ఆరోపణలు చేయడమే కాక అందుకు సాక్ష్యాన్ని కూడా ప్రస్తావించారు.  

 

ఈ సభలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పరిపాలనలో పోలీసు రాజ్యం నడుస్తోందని, రాష్ట్రం అత్యాచారాల ప్రదేశ్‌గా నడుస్తోందని దుయ్యబట్టారు. చివరకు అత్యాచారాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే అని చెబుతూ.. అత్యాచారాలు చేసిన మంత్రులు దేశం మొత్తం మీద నాలుగురు ఉన్నారని అన్నారు. అయితే అందులో ఇద్దరు ఏపీలోనే ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మాట తాను చెప్పింది కాదని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్స్(ఏడీఆర్) అన్న సంస్థ కేసుల నంబర్లతో సహా ప్రింట్ చేసి చూపించారని జగన్ అన్నారు. దీంతో ఏపీలో అత్యాచారం చేసిన ఆ ఇద్దరు టీడీపీ మంత్రులెవరో తెలుసా? జగన్ అన్న మాటలు ఎవరిని ఉద్దేసించినవి అంటూ చర్చలు మొదలయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -