Monday, May 13, 2024
- Advertisement -

ఈటీవీ బ్రేకింగ్ న్యూస్ః చిత్తూరు జిల్లా శ్రీసిటీలో చొరబడిన ఉగ్రవాదులు… కాల్పుల్లో నలుగురు మృతి

- Advertisement -

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక ప్రాంతం శ్రీసిటీలో ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉగ్రవాదులు భద్రతా సిబ్బందితో సహా అక్కడున్నవారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నాయి. …..

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే తెలుగు ప్రజలకు ఈటీవీ న్యూస్ అందించిన బ్రేకింగ్ వార్త ఇది. చిత్తూరు జిల్లాలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అదే విషయాన్ని మీడియాకు తెలియచేశాయి. ఆ మాక్ డ్రిల్ అన్న విషయాన్ని అస్సలు పట్టించుకోని ఈటీవీ పెద్దలు ‘చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఉగ్రవాదుల కాల్పులు’ అంటూ బ్రేకింగ్ న్యూస్‌తో విరుచుకుపడ్డారు. జనాలను బెంబేలెత్తించారు. కనీస స్థాయిలో కూడా జ్ఙానం లేకుండా జనాలను భయపెట్టారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న వార్తను కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలన్న జ్ఙానం లేకుండా పోయింది. నంబర్ ఒన్ మీడియా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకునే ఈనాడు, ఈటీవీ వారు రోజు రోజుకూ దిగజారిపోతున్నారని ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళే ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు అభిమానులు కూడా ఇప్పుడు ఈనాడు మీడియాను చూసి ఉసూరుమంటున్నారు. అయినప్పటికీ ఈ మీడియా మాత్రం రోజు రోజుకూ దిగజారుతోంది. నమో భజనతో పాటు , చంద్రబాబు, కెసీఆర్‌ల భజనకే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇక ఇలాంటి అతి పెద్ద మిస్టేక్స్ కూడా ఈ వారు తరచుగా చేస్తుండడం విస్తుగొలుపోతోంది. ఆంద్రప్రదేశ్‌లో ఉగ్రవాదులు కాల్పులు అన్న వార్తను అందరికంటే ముందే ఇవ్వాలన్న అత్యుత్సాహంలో అది మాక్ డ్రిల్ అన్న విషయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు. అదీ మన మీడియా దుస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -