Saturday, May 18, 2024
- Advertisement -

మ‌రో భారీ అంత‌రిక్ష ప్ర‌యోగానికి ఇస్రో సిద్ధం

- Advertisement -
GSLV MK-III : June 5 launch of ‘fat boy’ to pave way for manned mission

భార‌త అంత‌రిక్ష సంస్థ ఇస్రో మ‌రో భారీ ప్ర‌యోగానికి సిద్ద‌మ‌య్యింది.స్వ‌దేశీ ప‌రిజ్ణానంతో రూపొందించిన రెండు వంద‌ల ఏనుల‌గుల బ‌రువైన రాకెట్‌ను అంత‌రిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

జియో సింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ) మార్క్‌-3గా పేర్కొనే ఈ రాకెట్‌ ప్రయోగంతో ఇస్రో త‌న స‌త్తా చాటేందుకు ఇస్రో అడుగువేస్తోంది.
క్ర‌యోజెనిక్ ఇంజిన్ రాకెట్ ప్రయోగాల కోసం ప్రపంచ దేశాల నుంచి ఇస్రోకు భారీ డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సుమారు నాలుగు టన్నుల బరువుండే భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను భూ అనువర్తిత కక్ష్య (జీటీవో)లోకి ప్రవేశ పెట్టేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది.ఇది విజ‌య‌వంత‌మ‌యితే అంతరిక్ష వాణిజ్యంలోనూ గణనీయమైన వాటాను చేజిక్కించుకునేందుకు ఇస్రోకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది. దీని సాయంతో అంత‌రిక్షంలోకి భార‌త వ్యోమ‌గాముల‌ను పంప‌నుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని రాకెట్‌పోర్టులో ఠీవిగా నిలబడి ఉన్న ఇస్రో బాహుబలి.. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ణానంతో త‌యారుచేసిన జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ మార్క్-3 (జీఎస్‌ఎల్వీ ఎంకే-3) జూన్ మొదటివారంలో అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షయాన చరిత్రలో భారత్ మరో మైలురాయిని అధిగమించినట్లవుతుంది
జీఎస్ఎల్వీ 3 మార్క్ ప్రయోగం విజయవంతమై, రోదసీలోకి వ్యోమగామిని పంపితే రష్యా, అమెరికా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన దేశంగా మరో చరిత్రను భారత్ నెలకొల్పనుంది.దీని కోసం ఇస్రో శక్తివంతమైన క్రయోజెనిక్‌ ఇంజిన్‌‌ను అభివృద్ధి చేసింది.తొలి నాల్ల‌లో ఇస్రో విప‌ల‌మ‌యినా వాటిని సోపానాలుగా మ‌లుచుకుంటు అనేక విజ‌యాలు సొంతం చేసుకుంది.

{loadmodule mod_custom,Side Ad 2}

మొద‌టి ప్ర‌యేగంలోనే దీన్ని విజ‌య‌వంతం చేసేందుకు శాస్త్ర‌వేత్త‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.ఈ నేపథ్యంలో జూన్ 5 న నాలుగు టన్నుల బరువున్న ఈ రాకెట్ ను భారత్ ప్రయోగించనుంది. అలాగే ఈ రాకెట్ భౌగోళిక కక్ష్యలో 4 టన్నులు, తక్కువ ఎత్తు భూకక్ష్యలో 8 టన్నుల ఉపగ్రహాలను ఉంచగలదు. ఈ రాకెట్‌లో ఇంధనం కోసం ద్రవ ఆక్సిజన్, హైడ్రోజన్ తొలిసారిగా వినియోగిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -