- Advertisement -

గోవాలో ఉప ఎన్నిక రద్దు:హైకోర్టు తీర్పు

- Advertisement -

గోవాలో జరగాల్సిన పండా అసెంబ్లీ ఉప ఎన్నికను బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను “నల్ అండ్ వాయిడ్”గా (శూన్యం) ప్రకటించింది.

ఈ ఉప ఎన్నిక మాజీ మంత్రి రవి నాయక్‌ మరణంతో అనివార్యమైంది. ఆయన గత ఏడాది అక్టోబర్‌లో మరణించడంతో, ఎన్నికల సంఘం ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ప్రకటించింది.

గోవా బెంచ్‌కు చెందిన జస్టిస్ వాల్మీకి మెనెజెస్, జస్టిస్ అమిత్ జంశాండేకర్‌ల బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఓటర్లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపి ఈ తీర్పును వెలువరించింది.

పిటిషనర్లు..ప్రస్తుత అసెంబ్లీ కాలానికి ఒక సంవత్సరం కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి కాదు..ఎన్నికై వచ్చే ఎమ్మెల్యే కేవలం కొద్దికాలం మాత్రమే పదవిలో ఉంటారు.అందువల్ల ఈ ఉప ఎన్నిక అవసరం లేదని పేర్కొన్నారు

ఈ తీర్పుతో గోవాలో జరగాల్సిన పండ ఉప ఎన్నిక నిలిచిపోయింది. అసెంబ్లీ కాలం చివరి దశలో ఉప ఎన్నికల అవసరంపై ఈ నిర్ణయం కీలక చర్చకు దారి తీసే అవకాశముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -