Wednesday, May 15, 2024
- Advertisement -

ప్ర‌ణ‌య్ విగ్ర‌హం ఏర్పాటుపై కోర్టు ఏమందంటే..?

- Advertisement -

మిర్యాలగూడలో పరువు హత్యకుగురైన ప్రణయ్ కి విగ్రహం ఏర్పాటు చేయాలని కొందరు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే వివాదం జ‌రుగుతోంది. ణయ్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని, అప్పటి వరకు ఎలాంటి పనులను చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి కోరిక మేరకు అతడి విగ్రహాన్ని మిర్యాలగూడలోని సాగర్‌ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్‌ విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌పై హైకోర్టు జస్టిస్‌ ఏవీ. శేషసాయి పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటులో కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్‌ సీఐ, మున్సిపల్‌ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. కాగా టూటౌన్‌ సీఐ ప్రణయ్‌ తండ్రికి నోటీస్‌లు ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన అధికారులు వచ్చే నెల 23వ తేదీన కోర్టుకు హాజరుకావాలని కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -