Tuesday, May 14, 2024
- Advertisement -

బాల‌సాయి బాబా ఆశ్ర‌మంలో బ‌య‌ట‌ప‌డ్డ ఆస్తులు

- Advertisement -

బాలసాయిబాబా గుండెపోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రయంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. బాలసాయి బాబా మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న అభిమానులు,భ‌క్తులు శోక సంధ్రంలో మునిగిపోయారు.ఇక ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో అంద‌రి క‌ళ్లు ఆయ‌న ఆస్తుల మీద ప‌డ్డాయి.

ఒక ద‌శ‌లో పుట్ట‌ప‌ర్తి సాయిబాబాకి పోటీగా భ‌క్తుల‌ను సంపాదించిన బాల‌సాయి బాబా త‌రువాత కాలంలో వివాదాల‌లో ఇరుక్కోని త‌న ప్రాచుర్యం త‌గ్గించుకున్నారు.బాలసాయి బాబాకు తెలుగు రాష్ట్రాల‌లోనే కాక విదేశాల‌లో కూడ భ‌క్తులు ఉన్నారు.బాల‌సాయి బాబా …ట్ర‌స్ట్ ద్వారా చాలానే ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్లు స‌మాచారం.విదేశి భ‌క్తులతో పాటు ,ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు బాల‌సాయి బాబా ఆశీస్సులు కోసం క్యూ క‌ట్టేవారు.విదేశి భ‌క్తులు ఆయ‌నకు ఎక్కువుగా కార్లును కానుక‌గా ఇచ్చేవార‌ని తెలుస్తుంది.

వీటి ఖ‌రీదు కూడా చాలా ఎక్కువుగా ఉంటుందని స‌మాచారం.ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న కార్లు ఖ‌రీదే దాదాపు 300 కోట్లు ఉంటుంద‌ని అంచానా.ఇక స్థిరాస్తులు వివరాలు చాలా గోప్యంగా ఉంచారు బాలాసాయి బాబా.ట్ర‌స్ట్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బుతో ఎక్కువుగా క‌ర్నూలు జిల్లాలో భుములు కొనుగొలు చేసిన‌ట్లు తెలుస్తుంది.ల్యాండ్‌ల రూపంలోనే ఆయ‌న ద‌గ్గ‌ర 1500 కోట్ల ఆస్తి ఉంద‌ని ట్ర‌స్ట్ స‌భ్యులు ద్వారా తెలుస్తుంది.ఇక చిన,చిత‌క మొత్తం క‌లిపి 2000 కోట్ల వర‌కు బాలసాయి బాబా ఆస్తి ఉంటుంద‌ని అంచనా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -