Tuesday, May 14, 2024
- Advertisement -

ఇడ్లి మ‌న‌దేశంలో పుట్టింది కాదంట‌…ఎక్క‌డ పుట్టిందో తెలుసా…?

- Advertisement -

టిఫిన్స్ ఎన్ని ర‌కాలున్నా ముందుగా ట‌క్కున గుర్తుకొచ్చేది ఇడ్లీ. ఆయిల్ లేకుండా త‌యారు చేసె వంట‌కం ఇదొక్క‌టే. అందుకే డాక్ట‌ర్లు కూడా పేషెంట్ల‌కు ఇడ్లీనె ప్రిఫ‌ర్ చేస్తారు.పూర్తిగా నూనె లేకుండా తయారయ్యే వంటకం కావడంతో ఇది ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు సృష్టించదని నమ్ముతారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇడ్లీ దక్షిణాది వంటకం అని, ముఖ్యంగా తమిళనాడు సంప్రదాయ వంటకం అని ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆశ్చ‌ర్య క‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది.

పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే దీన్ని కడుపు నిండా ఆరగించవచ్చు. సులభంగా జీర్ణం చేసుకోవచ్చు. ఇడ్లీకి ఇండియాలో అంత డిమాండు.. అంత అభిమానం. అయితే ఇడ్లీ పుట్టింది మ‌న‌దేశంలో కాదట‌.ఇండోనేషియాలో పుట్టి మ‌న దేశానికి వ‌చ్చిందంట‌. ఆచార్య అనే ఫుడ్ హిస్టరియన్ మాత్రం ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందని చెబుతున్నారు.అయితే ఇడ్లీ మొద‌ట పుట్టింది మ‌న‌దేశంలో కాక‌పోయినా దాన్ని మొద‌ట త‌యారు చేసింది హిందూరాజులేనంట‌.

ఇండోనేషియా దేశాన్ని పాలించి హిందూ రాజులు ఉడికించే వంటకాల తయారీలో భాగంగా ఇడ్లీకి రూపకల్పన చేశారని ఆచార్య వివరించారు. 800 నుంచి 1200 సంవత్సరాల మధ్యలో ఇడ్లీ భారతదేశంలో ప్రవేశించిందని,మొదట కర్ణాటకలో ప్రాచుర్యం పొందిందని వివరించారు. ఆనాడు వాటిని ఇడ్డలిగే అని పిలిచేవార‌న్నారు. దీనికి సంబంధించి మ‌రో క‌థ కూడా ప్ర‌చారంలో ఉంది.

కొందరు అరబ్ వ్యాపారులు ఇడ్లీలను భారతీయులకు పరిచయం చేశారని ఈజిప్ట్ గ్రంథాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. అరబ్ వ్యాపారులు దక్షిణ భారతదేశానికి చెందిన స్త్రీలను పెళ్లాడడం వల్ల ఇడ్లీలు దక్షిణాదిలో అడుగుపెట్టాయని కైరోలోని అల్ అజహర్ విశ్వవిద్యాలయంలో ఉన్న పత్రాలు చెబుతున్నాయి. ఎప్పుడు పుట్టినా.. ఎక్కడ పుట్టినా.. ప్రపంచం మాత్రం ఇడ్లీ ఇండియాదేనని బలంగా నమ్ముతుంది. భారతీయుల నమ్మకం కూడా అదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -