Thursday, April 25, 2024
- Advertisement -

కరోనాని జయించిన సీఎం కేసీఆర్…

- Advertisement -

తెలంగాణలో ఈ మద్య కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు కరోనా భారిన పడి చనిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా వైరస్ సోకింది. ఆయన ఫామ్ హౌజ్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. సిఎం కెసిఆర్ ఐసోలేషన్‌లో వుంటున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎం.వి.రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

గత నెల 19న కేసీఆర్ లో కోవిడ్ స్వల్ప లక్షణాలు వెలుగు చూడటంతో వెంటనే వైద్య సిబ్బంది ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో కూడా ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను ఫాంహౌస్‌లో ఉంటూ చికిత్స పొందారు. గతనెల 21న సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సీఎంకు సీటీస్కాన్‌తో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో ఆయనకు లంగ్స్‌లో ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదని తేలింది. తాజాగా రాపిడ్ యాంటిజెన్‌తో పాటు ఆర్టీపిసిఆర్ పరీక్షలు రెండింటిలోనూ నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షలు రిపోర్టులు కూడా సాధారణంగా వున్నాయని తేలింది. దాంతో సిఎం కెసిఆర్ పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.

తమిళనాట విషాదం.. ఆక్సీజన్ అందక 11 మంది మృతి

నేటి పంచాంగం, బుధవారం (5-5-2021)

మహానటి తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -