డాన్ కొడుకుగా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

- Advertisement -

గత ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం పరుశరామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.

‘అతడు’ ‘ఖలేజా’ వంటి ఫ్యాన్స్ కలకాలం గుర్తు పెట్టుకునే సినిమాల చేసిన తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి ‘పార్థు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఓ డాన్ కొడుకుగా కనిపించబోతున్నాడట. అలాగే ఆ డాన్ పాత్రను అనీల్ కపూర్ చేయబోతున్నాడని సమాచారం.

- Advertisement -

ఈ మూవీ తండ్రి కొడుకుల మధ్య జరిగే యుద్దం అని అంటున్నారు. ఇందులో మహేష్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా కనపడతాడని చెబుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబో తున్నట్లు తెలిసింది. అందులో ఒక హీరోయిన్‌గా కియారా అద్వానీ మరొక హీరోయిన్‌గా పూజ హెగ్డేని తీసుకోవాలనుకుంటున్నారట. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

కరోనాని జయించిన సీఎం కేసీఆర్…

తమిళనాట విషాదం.. ఆక్సీజన్ అందక 11 మంది మృతి

మహానటి తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -
- Advertisement -