Sunday, May 5, 2024
- Advertisement -

ఇస్రో ఖాతాలో మ‌రో చారిత్రాత్మక విజ‌యం…చంద్ర‌యాన్ 2 స‌క్సెస్‌

- Advertisement -

భార‌త దేశ ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచానికి ఇస్రో మ‌రో సారి చాటి చెప్పింది. ప్ర‌తీష్టాత్మకంగా చేప‌ట్టిన చంద్ర‌యాన్ 2 ప్ర‌యేగం విజ‌య‌వంతం అయ్యింది. 2008 నుంచి చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు ప్రయోగించాలని అనుకున్న చంద్రయాన్‌–2 మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. సాకేంతిక లోపాన్ని వారం రోజుల వ్య‌వ‌ధిలోనె ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు స‌రి చేసి ప్రయోగానికి సిద్దం చేశారు శాస్త్ర‌వేత్త‌లు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్ఎ‌ల్వీ రాకెట్ 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.బయలుదేరిన 16:13 నిమిషాల తర్వాత చంద్రయాన్‌-2 నిర్ణీత కక్ష్యలోకి సమర్థవంతంగా ప్రవేశించింది. కక్ష్యలోకి ప్రవేశించాక వాహన నౌక నుంచి చంద్రయాన్‌-2 ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది.

చంద్రయాన్-2 ఉపగ్రహం 52 రోజుల పాటు ప్రయోగించిన అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుంది. చంద్రయాన్‌-2ను చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంలోకి ప్రవేశ పెట్టడమనేది అత్యంత క్లిష్టమైన అంశం. ఆర్బిటల్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ విడిపోయాక 15 నిమిషాల అత్యంత కీలకం. రోవర్‌ సెకెన్‌కు ఒక సెంటీమీటర్‌ వేగంతో కదులుతుంది. రోవర్‌ ఒక లూనార్‌ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్‌ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి సమాచారాన్ని, చిత్రాలను పంపనుంది. చంద్రుడిపై జల, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి ఇది పరిశోధనలు చేయనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -